సీఎం హాస్యస్పద వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..! విష ప్రచారం మానుకోవాలి: తాండూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల వెంకటేష్

వికారాబాద్ జిల్లా తాండూర్

సీఎం హాస్యస్పద వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..! విష ప్రచారం మానుకోవాలి: తాండూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల వెంకటేష్

తాండూర్ జూలై 22:

తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్యస్పదంగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల వెంకటేష్ హెచ్చరించారు.

సీఎం సరదాగా, హాస్యస్పదంగా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారం చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం మానుకోవాలని సూచించారు.

తాండూర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని గాజుల వెంకటేష్ విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి ఇలాంటి విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.