RTC లో నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..

RTC లో నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరులో నిరుద్యోగులకు RTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేటి నుంచి విధులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టడంతో బస్సులు బస్సు డిపోలకే పరిమితమయ్యాయి.

దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండడంతో ప్రభుత్వం పోలీసుల పహరాలో బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు కండక్టర్, డ్రైవర్ల కోసం అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు తాండూర్ డిపోలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుగుణాత్ పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పదో తరగతి సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డు మరియు అనుభవం కలిగిన డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్ తో తాండూర్ డిపో మేనేజర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.