రజక సంఘం నూతన కార్యవర్గం.

🔴 రజక సంఘం నూతన కార్యవర్గం.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరు రజక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ తాండూర్ లో అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ బి ఓ ఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ మరియు కౌన్సిలర్ రాము లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన రజక సంఘం కార్యవర్గ సభ్యులను అతిథులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ తాండూరులో సమావేశాల కోసం నియోజకవర్గ రజక కుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దోబీ ఘాట్ నిర్మాణం మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయని వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు.

అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ కుల సంఘాలు ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులైన రజక కులస్తులకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు.

కుల సంఘంలోని సభ్యులకు సహాయపడటమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి వారి అభివృద్ధికి సహకరించే విధంగా కుల సంఘాలు కృషి చేయాలని ఆర్బిఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తమ ఆశాభావం వ్యక్తం చేశారు.

రజక కుల సంఘం సభ్యులు, నాయకుల కోరిక మేరకు సహకారం తెలుపుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా వారికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మీ సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

తాండూర్ లో నివసిస్తున్న ప్రజలందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని కోరుకోవాలన్నారు. అయితే ఈ మధ్యన పిల్లలు, యువకులు చెడు దారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అయితే మత్తుకు బానిసలుగా మారకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో రజక సంఘం యొక్క ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని నాయకులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వారిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బల్ రెడ్డి,ఆర్ బి ఓ ఎల్ అధినేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ , 22 వ వార్డ్ కాన్సిలర్ రాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ పట్లోళ్ల నర్సింలు, తెలంగాణ రాష్ట్ర రజక జేఏసీ చైర్మన్ పంచుగారి ఆంజనేయులు, వికారాబాద్ రజక సంఘం అధ్యక్షులు రాములు, తాండూర్ వికారాబాద్ జిల్లా ఉద్యోగ, ఉపాద్యాయ అధ్యక్షలు శ్రీ మోహన్, అసోసియేట్ అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షులు నాగప్ప,  తాండూర్ పట్టణ రజక సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ ఆర్ నర్సింలు రిటైర్డ్ సబ్ రిజిస్టర్. తాండూర్ నియోజక వర్గ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యక్షులు ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి T. శ్రీనివాస్, కోలనివారి-ch రాములు , చంద్రయ్య, రమేష్ మాజి రజక సంఘం అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాకలి కృష్ణ, తాండూర్ పట్టణ రజక సంఘం నూతన అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్ మరియు ఇతర రజక సంఘ పెద్దలు, సుహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.