డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ రహిత తాండూర్.

🔴 డ్రగ్స్ రహిత తాండూర్ – మనందరి బాధ్యత.

   మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి..
డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ రహిత తాండూర్

99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా తాండూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనలో (యాంటీ డ్రగ్స్) భాగంగా శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు 2k రన్ నిర్వహించారు.

ఈ సందర్బంగా తాండూర్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ. డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ భద్రతను దెబ్బతీస్తుందని,అందుకే  డ్రగ్స్ రహిత తెలంగాణ,  డ్రగ్స్ రహిత తాండూర్ గా లక్ష్యం ప్రతి పౌరుడి కర్తవ్యంగా ఉండాలని.

అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,యువతకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోలని.

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడిపి వారి సమస్యలు తెలుసుకోవాలని అన్నారు.

నిన్న జరిగిన సంఘటన చాల భాదకరమని,మన తాండూర్ ప్రజలందరూ తల దించుకొనే విధంగా ఉందని,మన తాండూర్ ప్రజలందూ ఎవరి వెంబడి ఉన్నారు, ఎవరితో ఉండాలి అనేది నిర్ణయించుకోవల్సిన అవసరం ఉందని అన్నారు.

2k రన్ లో తాండూర్ మర్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ సిబ్బంది,పలు వార్డుల కౌన్సిలర్స్,పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు,ప్రముఖులు, యువత పాల్గొన్నారు.