🔴 మంచి నీటి సమస్య ను పరిష్కరించండి.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ లో మంచి నీటి సమస్య ను పరిష్కరించాలి. మాజీ కౌన్సిలర్ బి ఆర్ ఎస్ మహిళా అధ్యక్షు రాలు శ్రీమతి సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా తాండూర్ లో మంచినీటి సరఫరా లేకుండా సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు .
ఈ విషయమై అధికారులను అడగగా పరిగిలో పైప్ లైన్ రిపేరింగ్ జరుగుతుందని ఇంకా మూడు నాలుగు రోజుల వరకు నీటి సరఫరా ఉండదు అని చెప్పడం జరిగింది.
మరి ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని తాండూర్ కి కాగ్నా నది దేవుడు ఇచ్చిన వరమని ఆ నది నీళ్ల ను సరఫరా చేయాలని గత రెండేళ్ల నుంచి ఇలాగే ప్రతిసారి పైప్ లైన్ రిపేరింగ్లని పండుగల సమయంలో నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు .
ఇప్పుడు ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మరియు హిందువుల నూతన సంవత్సర ఉగాది పండుగల సమయంలో నీటి సరఫరాను ఆపేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
కావున ఇలాంటిది పునరావృతం కాకుండా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ని తక్షణమే కాగ్న నది నీళ్లను త్వరగా సరఫరా చేయాలని మన తాండూరు కాగ్న నది నీళ్లను మనమే వినియోగించుకునేటట్టు అంతరాయం లేని నీటి సరఫరాను జరపాలని దానికి చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాముఅని అమె తెలిపారు.
