🔴 మూత్రశాలలు లేని తాండూర్ పట్టణం..?
🔴 పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్స్ మూత్రశాలలు లేకపోవడంతో మహిళలకు చాలా ఇబ్బంది.
🟣 సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో చుట్టుపక్కల నుండి చాలామంది ప్రజలు రైతులు విద్యార్థులు ఆయా పనుల నేపథ్యంలో రోజు వస్తుంటారు పోతుంటారు కానీ తాండూర్
పట్టణాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో ప్రజా మూత్రశాలలు కూడా ఒకటి. అయితే తాండూర్ ప్రాంతంలోని పలుచోట్ల ప్రజా మూత్రశాలలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువగా సమస్యలు చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయని తెలియజేశారు.
తాండూర్ పట్టణంలోని ప్రధాన రహదారి ప్రాంతం. ఇక్కడ రోజూ వందలాది మంది ప్రజలు రాకపోకలు కోనసాగిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజలకు అవసరమైన ప్రజా మూత్రశాల సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
బస్టాండ్, రైల్వే స్టేషన్ కూరగాయల మార్కెట్ ప్రధాన రోడ్డు మార్గాలలో ప్రాంతం, ఇబ్బందిగా ఉన్న ప్రజలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు స్మశాన వాటికలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ మూత్రశరాలకు వెళుతున్నారు.
మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాంమని దగ్గరలో ఎక్కడా మూత్రశాల లేదు. తాండూర్ మున్సిపల్ అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలలని
మహిళల కోసం ప్రత్యేకంగా మూత్రశాల లేకపోవడంతో బయటకు రావడమే కష్టంగా మారింది.
మున్సిపల్ అధికారుల కు ఇవన్నీ సమస్యలు తెలిసినా కూడా ఏం తెలియనట్టు నటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కొత్త గా ఎంపికైన మున్సిపల్ కౌన్సిలర్లు. అధికారులు, ఇప్పుడైనా కట్టిస్తారేమో వివేచి చూడాలి మూత్రశాలలు కొత్తగా నిర్మిస్తారేమోనాని మా బాధలు తీరుతాయేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
