🔴 లంచం తీసుకుంటూ ఎగ్జామినర్ ను పట్టుకున్న ఏసీబీ
నిజ స్వరం హైదరాబాద్ ప్రతినిధి ::
హైదరాబాద్‌లో రు 35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్ సంతోష్ ను పట్టుకున్న ఏసీబీ
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను లంచం తీసుకుంటూ ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను GHMC హెడ్ ఆఫీస్‌కు పంపించేందుకు ₹40,000 డిమాండ్ చేసి ₹35,000 స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
🔴 ముఖ్య గమనిక
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), 2) (@TelanganaACB) ລ້ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. తెలియజేశారు.
ఫిర్యాదుధారుల బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును అని తెలియజేశారు.
