శ్రీరామ మందిరం పునర్నిర్మాణం.

🔴 శ్రీరామ మందిరం పునర్నిర్మాణం.

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

శ్రీరామ మందిరం పునర్నిర్మాణం. ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.

ఆలయ పునర్నిర్మాణానికి తనవంతు తోచిన సహాయం చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇంద్ర నగర్ లో ప్రసిద్ధిగాంచిన రామ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా. ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు పున ప్రతిష్టపన కార్యక్రమం. అలాగే 27వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కీ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. అదేవిధంగా పునర్నిర్మాణంలో భాగంగా తనవంతు విరాళాన్ని ఇస్తానని తెలిపారు.

ఈనెల 23 నుండి 27వ తేదీ వరకు ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన తో పాటు 27వ తేది శ్రీరామనవమి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోందని.

ఐదు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించి శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.