నాటు సారా అమ్మే వ్యక్తి అరెస్ట్.
వికారాబాద్ జిల్లా మధ్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి
కే .విజయభాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యం లో గురువారం రోజు తాండూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో (01 ) నాటుసారా కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.
వివరాల ప్రకారం ఒక వ్యక్తి నాటు సారాయి తయారుచేసి చుట్టుపక్కల గ్రామాల వారికి విక్రయిస్తున్నాడు అన్న అందిన సమాచారంతో నెల్లిగడ్డతాండా నుంచి రుక్మాపూర్ వెళ్లే రోడ్డులో రూట్ వాచ్ నిర్వహిస్తుండగా అటుగా ఒక వ్యక్తి బైక్ పై వెళుతుండగా గమనించిన సిబ్బంది అడ్డగించి అతని యొక్క వివరాలు అడగగా మూడవత్ రాజేష్ S/O గోపాల్ వయస్సు : 25, నెల్లిగడ్డ తాండా పెద్దేముల్ మండలం, అని తెలిపారు.
తదుపరి బైకును సోదా చేయగా ముందల ఒక మూట ఉన్నది అందులో ఏమున్నదని తెరిచి చూడగా నాటు సారాయి ప్యాకెట్లు (05) ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక లీటరు మొత్తం సుమారు 5 లీటర్లు నాటు సారాయి ఉన్నట్లు గమనించి అట్టి బైకును మరియు లభించిన ఐదు లీటర్ల నాటు సారాయిని సిజ్ చేసి అతనిని అదుపులోకి తీసుకొని ఈ విధంగా నాటు సారా ఈ తయారు చేయడం విక్రయించడం రవాణా చేయడం చట్ట రిత్యా నేరమని తెలిపి అతనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తామని తెలిపారు.
ఈ రూట్ వాచ్ లో ఎస్సైలు శ్రీ నిజాముద్దీన్ , శ్రీ రవికుమార్. సిబ్బంది భీమయ్య రాజేందర్ ఆసిఫా బేగం రమేష్ మహేష్ పాల్గొన్నారు, ఈ విధంగా నాటు సారాయి తయారుచేసిన విక్రయించిన కలిగి ఉన్న రవాణా చేసిన ఈ నెంబర్ కు 8712658754 సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడును
తాండూర్ ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ ఎన్ రాణి వెల్లడించారు.
