అనారోగ్యంతో బాధపడుతున్న సిద్దిలింగయ్య స్వామికి BSR పరామర్శ

🔴 అనారోగ్యంతో బాధపడుతున్న సిద్దిలింగయ్య స్వామికి BSR పరామర్శ.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి::

తాండూర్: ప్రముఖ ప్రవచనాల వక్త సిద్దిలింగయ్య స్వామి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. స్వామి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వైద్యులను కలిసి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.

సిద్దిలింగయ్య స్వామికి మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్యులను BSR కోరారు. అనంతరం స్వామిని పరామర్శించి ధైర్యం కల్పించారు. అనారోగ్య సమయంలో తాను అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని సిద్దిలింగయ్య స్వామికి భరోసా ఇచ్చారు.

సిద్దిలింగయ్య స్వామి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్వామి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.