తాండూరులో గంజాయిపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
వికారాబాద్ జిల్లా: తాండూర్ పట్టణంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని స్కూల్స్, కాలేజీల పరిసరాలతో పాటు వాటికి సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల్లోనూ తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, యువత గంజాయికి బానిస కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
తాండూర్‌ను గంజాయి రహిత పట్టణంగా మార్చేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
