కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వికారాబాద్ జిల్లా: తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు, వేషధారణలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో సందడి చేశారు. చిన్నారుల అద్భుతమైన ప్రదర్శనలను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

వేడుకల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
