వికారాబాద్ జిల్లా…
తాండూర్ నియోజకవర్గంలో వరుస చోరీలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు
తాండూర్ నియోజకవర్గంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. యాలాల్‌తో పాటు తాండూర్ పట్టణంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తాండూర్‌లోని లో ఓ ఇంటి తాళం పగలగొట్టిన దుండగులు 10 తులాల బంగారం, రెండు కిలోల వెండి, నగదును అపహరించినట్లు సమాచారం. అదేవిధంగా శ్రీ సాయి జానకీరామ్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను దొంగలు అపహరించారు.
ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో రాత్రివేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
