వికారాబాద్ జిల్లా తాండూర్
యాలాల మండలంలో RBOL ఇండస్ట్రీస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వికారాబాద్ జిల్లా, యాలాల మండలం: RBOL ఇండస్ట్రీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా కు వందనం చేశారు.
కార్యక్రమంలో సంస్థ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగుల సమిష్టి భాగస్వామ్యంతో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి నడుమ వేడుకలు ఆనందంగా జరిగాయి.
