తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాహసం.. నాగుపామును పట్టిన అబ్దుల్ రజాక్

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాహసం.. నాగుపామును పట్టిన అబ్దుల్ రజాక్

తాండూర్ పట్టణంలోని కొకట్ రోడ్డులో ఉన్న ఓ కిరాణా దుకాణంలో భారీ నాగుపాము కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. పామును గమనించిన దుకాణ యజమాని భయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఘటనాస్థలికి చేరుకుని, చాకచక్యంగా నాగుపామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అబ్దుల్ రజాక్ చూపిన ధైర్యసాహసాలను స్థానికులు అభినందించారు.