స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్‌గా గాజుల వెంకటేష్ నియామకం

వికారాబాద్ జిల్లా – తాండూర్

స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్‌గా గాజుల వెంకటేష్ నియామకం

తాండూర్ పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్‌గా గాజుల వెంకటేష్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా గాజుల వెంకటేష్ మాట్లాడుతూ, తాను పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను గుర్తించి స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ పదవిని అప్పగించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, బుయ్యాని శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

త్వరలో దేవాదాయ శాఖ నుంచి నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గాజుల వెంకటేష్ తెలిపారు.