BRSV ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

వికారాబాద్ జిల్లా తాండూర్

BRSV ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

తాండూర్:

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని BRSV తాండూర్ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూర్ టౌన్‌లోని నంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో “Gift a Smile” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్‌లు, జ్యామెట్రీ బాక్స్‌లు, పెన్నులు పంపిణీ చేసి, రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో BRSV జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, సందీప్ నాయక్, వినోద్ కుమార్, భాను, తోసిఫ్, రెహానా తదితర BRSV విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.