విలియమూన్ మైదానంలో క్షుద్ర పూజలు.

🔴 విలియమూన్ మైదానంలో క్షుద్ర పూజలు.

నిజ స్వరూపం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బుధవారం అర్థ  రాత్రి ఓ వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తూ స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

తాండూరు పట్టణంలోని విలియమూన్ మైదానంలో ఉన్న పొదలో గుండు దేవుడు అనే ఓ యువకుడు క్షుద్ర పూజలు చేస్తూ పట్టు బడ్డాడు.

బాలికకు చాలా రోజులుగా పెళ్లి కావడం లేదని గుండు దేవుడిని కలవడంతో అర్ధరాత్రి విలియమూన్ గ్రౌండ్ లోని ఓ ముళ్ళపదలో కూర్చోబెట్టి పసుపు కుంకుమ,గుమ్మడికాయ, మిరపకాయలు, నిమ్మకాయలు తదితర వస్తువులతో పూజలు నిర్వహిస్తూ ఉండగా స్థానికులు గమనించి గుండు దేవుడిని పట్టుకొని పెళ్లి కావడం లేదని చిత్ర పూజలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు.

ఆ బాలికను అక్కడి నుండి పంపించి, గుండు దేవుడికి స్థానికులు చితక బది తగిన శాస్త్రి చేశారు. గుండు దేవుడిని చూసి స్థానికులు భయపడేవారు, ఇకనుండి క్షుద్ర పూజలు చేస్తున్న వారిని మాన్పించాలని పలువురు స్థానికులు వేడుకుంటున్నారు.