‘రైట్ రైట్’… అరుణాచలం ప్రత్యేక బస్సును ప్రారంభించిన తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్

వికారాబాద్ జిల్లా | తాండూర్

‘రైట్ రైట్’… అరుణాచలం ప్రత్యేక బస్సును ప్రారంభించిన తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్

తాండూర్ నుంచి అరుణాచలం వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సును తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో ఈ ప్రత్యేక బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. తాండూర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు కావడం స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు కూడా ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఈ బస్సు సేవలను ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌చార్జ్ వెంకటేశం, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.