తాళం వేసిన ఇండ్లే టార్గెట్.

🔴 తాళం వేసిన ఇండ్లే టార్గెట్

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం చింతామణిపట్నంలో రాత్రి ఒంటిగంట నుండి రెండు గంటల సమయంలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.

దొంగలు తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసినట్లు గ్రామస్తుల సమాచారం వరుసగా ఏడు ఇళ్లలో చోరీ జరిగిందిఅని. గ్రామస్తులు కురువ చిన్న మల్లప్ప, కురువ పెద్దమల్లప్ప, కప్పలి లాలప్ప, గౌడి విజయమ్మ, హరిజన్ వెంకటమ్మ, డీకొండ లక్ష్మయ్య, గోవర్ధన్ రెడ్డి దొంగతనం జరిగింది. కప్పలి లాలప్ప ఇంట్లో పట్ట గొలుసులు, గోవర్ధన్ రెడ్డి దగ్గర 7000 రూపాయలు దొంగతనం అయినట్లు బాధితులు తెలిపారు.

విషయం తెలుసుకున్న కరణ్ కోట్ పోలీసులు క్లూస్ టీం సహాయ సహకారాలతో విచారణ చేపట్టారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలో నలుగురి దొంగల చిత్రాలు రికార్డ్ అయినట్టు సమాచారం. మిగతావిరువారాలు తెలియాల్సి ఉంది.