ముదిరాజ్ బిడ్డ పండుగల సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు మంత్రి వాకిటి శ్రీహరికి వినతి.

🔴 ముదిరాజ్ బిడ్డ పండుగల సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు మంత్రి వాకిటి శ్రీహరికి వినతి

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

విగ్రహాన్ని బహుకరించేందుకు ముందుకొచ్చిన ఆగం పాండు ముదిరాజ్

తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ వాకిటి శ్రీహరిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ బిడ్డగా పేరుగాంచిన పండుగల సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి మంత్రికి వివరించి, విగ్రహ ప్రతిష్ఠాపనకు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పండుగల సాయన్న చరిత్ర, ఆయన చేసిన సేవలు, సమాజానికి అందించిన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘం ప్రతినిధులు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రివర్యులు వాకిటి శ్రీహరిని కలిసి తమ అభ్యర్థనను వివరించారు.

ఈ కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, పండుగల సాయన్న విగ్రహాన్ని బహుకరించేందుకు ఆగం పాండు ముదిరాజ్ ముందుకు రావడం. విగ్రహాన్ని అందించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకు రావడంపై ముదిరాజ్ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సమాజ ప్రముఖుల చరిత్రను గుర్తుచేసుకుంటూ, వారి సేవలను గౌరవించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

పండుగల సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా పండుగల సాయన్న చరిత్రను సమాజానికి మరింత చేరువ చేయడంతో పాటు, ఆయన ఆశయాలు మరియు సేవలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఈ భేటీలో హాజీపూర్ గ్రామ సర్పంచ్ సునీత రాజు, చేపల సంఘం అధ్యక్షులు కమాలి సురేష్, ఉపాధ్యక్షులు రాచురి అంజిలయ్య, కమాలి చెంద్రప్ప ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కమాలి చెంద్రప్ప, కమాలి వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.