స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్‌లో ఎమ్మెల్యే బీఎంఆర్. ఆరు వార్డుల్లో పారిశుద్ధ్య పనుల పరిశీలన…ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి

స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్‌లో ఎమ్మెల్యే బీఎంఆర్.

ఆరు వార్డుల్లో పారిశుద్ధ్య పనుల పరిశీలన…ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా

తాండూరు: పట్టణ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 19, 20, 21, 22, 23, 24 వార్డుల్లో నిర్వహించిన స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్‌ లో ఎమ్మెల్యే పాల్గొని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మురుగు కాలువల శుభ్రత, చెత్త సేకరణ, రోడ్లు, వీధుల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలను సమీక్షించారు. గొల్ల చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.

డ్రైనేజీ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన నూతన కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. దోమల నివారణకు నిరంతరం ఫాగింగ్ చేపట్టాలని, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

స్వచ్ఛ తాండూరు కార్యక్రమం ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కమిషనర్ రాకేష్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.