🔴 తాండూర్‌కు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాక
ఈ నెల 28న బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
నిజస్వరం తాండూర్ ప్రతినిధి::
తాండూర్ పట్టణం విలియం మూన్ స్కూల్ లో బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) తెలిపారు. ఈ నెల 28 బుధవారం నాడు మధ్యాహ్నం 03:00 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
