తుల్జాపూర్ భవానీ మాత భక్తులకు మహాప్రసాదం అందించిన పైలెట్ రోహిత్ రెడ్డి
తుల్జాపూర్: మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా తుల్జాపూర్లో శ్రీ తుల్జా భవానీ మాత దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మహాప్రసాదం అందించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తుల్జాపూర్ భవానీ మాత దర్శనం కోసం పాదయాత్రగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో మహాప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని భక్తులకు సేవలందించారు.
