వికారాబాద్ జిల్లా…
* తాండూరు మండలంలో ఫ్లెక్సీ పంచాయతీ
* నా అనుమతి లేకుండా ఫోటో ఎలా వేస్తారు?
* అవమానించేలా వ్యవహరించారంటూ సర్పంచ్ ఆగ్రహం
* పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఫ్లెక్సీల వ్యవహారం వివాదానికి దారితీసింది. చేనగేశ్పూర్, కోనాపూర్ గ్రామాల్లో విజయదశమి, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ సర్పంచ్, ప్రజలు, నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే, తన అనుమతి లేకుండా, కనీసం తనను మాట కూడా అడగకుండా ఫ్లెక్సీలపై ఫొటో పెట్టడంపై గ్రామ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించేలా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు.
