వికారాబాద్ జిల్లా | తాండూర్
మాతా శిశు ఆసుపత్రిలో మూడో రోజూ ఘనంగా నిత్య అన్నదానం
తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూర్ మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో నిర్వహిస్తున్న ఐదు రోజుల నిత్య అన్నదాన కార్యక్రమం సోమవారం మూడో రోజుకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఐదు రోజుల పాటు అన్నదానం నిర్వహించడం అభినందనీయమైన సేవా కార్యక్రమమని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

గత రెండు రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం మూడో రోజూ వందలాది మందికి భోజనం అందించగా, ఈ సేవా కార్యక్రమం ఆగస్టు 5 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
