లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిరసన.. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

వికారాబాద్ జిల్లా, యలల మండలం

లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిరసన.. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా  లక్ష్మీనారాయణపూర్ లో ధర్నా

వికారాబాద్ జిల్లా, యలల మండలం లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ యాలాల మండలం లక్ష్మి నారాయణపూర్ కాంగ్రెస్  పార్టీ  ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నరూ