వికారాబాద్ జిల్లా | తాండూర్
వార్డు నం. 36లో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న వార్డు ఇన్చార్జ్ కల్వ రాజవంశీ
తాండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో వార్డు ఇన్చార్జ్ కల్వ రాజవంశీ పాల్గొన్నారు. సంబంధిత అధికారులకు అవసరమైన పత్రాలను అందజేసి, ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. అధికారులు ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
