అనంతగిరి గుట్టపై ఆర్టీసీ బస్సు మొరాయింపు
వికారాబాద్ జిల్లా: అనంతగిరి గుట్టపై తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మార్గమధ్యలో మొరాయించింది. బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు డ్రైవర్ను కారణం అడగగా, డీజిల్ అయిపోయిందని డ్రైవర్ చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు.
దీంతో సుమారు గంటపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం వెనుక నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను తరలించారు.
బస్సును మెకానిక్ పరిశీలించగా డీజిల్ ట్యాంక్ పైపులోకి ఎయిర్ రావడంతో బస్సు ఆగిపోయినట్లు తాండూర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
