కోకట్ కగ్నలో వినాయక నిమజ్జనానికి నో…? కగ్న నది పరిరక్షణకు గ్రామ ప్రజల కీలక నిర్ణయం

వికారాబాద్ జిల్లా…

కోకట్ కగ్న నదిలో వినాయకుల నిమజ్జనానికి అడంకుళ్లు. 

యాలాల్ మండలం కోకట్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోకట్ గ్రామ ప్రజలు తాండూరు పట్టణానికి చెందిన వినాయక విగ్రహాలను కోకట్ కగ్న నదిలో నిమజ్జనం చేయకూడదని గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ పెద్దలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులకు అభ్యంతరం వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజల అభిప్రాయాలను గౌరవించి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న హిందూ ఉత్సవ కమిటీ తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కగ్న నది పరిరక్షణతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు హిందూ ఉత్సవ కమిటీ సహకరిస్తుందని అన్నారు.

తాగునీటి సదుపాయం కోసం బోర్వెల్ వేసేందుకు అంగీకరించారు.

నిమజ్జనం అనంతరం జెసిబి , హిటాచిలతో విగ్రహాలను తొలగించే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

మరి వినాయక నిమజ్జనానికి అడ్డంకులు తొలుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే..