వికారాబాద్ జిల్లా…
పాత తాండూరులో అర్ధరాత్రి సేవా స్ఫూర్తి – ప్రజల భద్రతే లక్ష్యంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి సంచలన నిర్ణయం!
తాండూరు: ప్రజా సేవ అంటే పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల్లో ఉండటమే అని నిరూపించారు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి.
పాత తాండూరు ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు అర్ధరాత్రి పరిష్కారం చూపారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో, పాత తాండూరులోని రైల్వే అండర్ బ్రిడ్జి నుండి నిజాం షా దర్గా వరకు గల ప్రధాన రహదారిపై వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను స్వయంగా దగ్గరుండి పూడ్చివేసే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.
పగటిపూట రద్దీ కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, పాత తాండూరు కౌన్సిలర్ల సమన్వయంతో రాత్రివేళలో ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా రహదారిని పూర్తిగా సురక్షితంగా మార్చారు.
సమస్య కనిపిస్తే స్పందించడం… పరిష్కారం అయ్యేవరకు నిద్రపోకుండా కృషి చేయడం – ఇదే నిజమైన ప్రజాసేవకు నిదర్శనం!
వర్షాలకు దెబ్బతిన్న రహదారులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటూ, పాత తాండూరు అభివృద్ధికి, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి కి, కౌన్సిలర్లకు పాత తాండూరు ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాత తాండూరు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అర్ధరాత్రైనా సరే… ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే సంకల్పం –
