గాంధీనగర్‌లో విషాదం.. రెండో అంతస్తు నుంచి పడి 18 నెలల బాలుడు మృతి

వికారాబాద్ జిల్లా | తాండూర్

గాంధీనగర్‌లో విషాదం.. రెండో అంతస్తు నుంచి పడి 18 నెలల బాలుడు మృతి

తాండూర్ పట్టణంలోని గాంధీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తన అమ్మమ్మ ఇంటి రెండో అంతస్తులో ఆడుకుంటున్న 18 నెలల బాలుడు దీక్షిత్ ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో, తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తాండూర్ ఎంసీహెచ్ (MCH) ఆసుపత్రికి తరలించారు బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌ సిఫారసు చేసిన వైద్యులు, సిఫారసు చేయడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సుమారు 8:50 గంటలకు బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని సిఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

ఈ ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమాచారం నమోదు చేసుకున్న పోలీసులు అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తాండూర్ పట్టణ సిఐ పరమేశ్వర్ గౌడ్.