ఇంటర్ విద్య జీవితానికె టర్నింగ్ పాయింట్ కందుకూరి రాజ్‌కుమార్

వికారాబాద్ జిల్లా తాండూరు

ప్రతి వారం ఒక హాస్టల్… ప్రతి విద్యార్థికి ఆరోగ్య భరోసా
విద్యార్థుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది
ఇంటర్ విద్య జీవితానికె టర్నింగ్ పాయింట్ కందుకూరి రాజ్‌కుమార్
బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం– మందుల పంపిణీ

బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో, న్యూ లోటస్ హాస్పిటల్, తాండూర్ సౌజన్యంతో తాండూర్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో విజయాలు సాధించగలరని అన్నారు. ఇంటర్ విద్య ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్ అని పేర్కొంటూ, ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదువుకోవాలని సూచించారు.

బీసీ సంఘం సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి వారం ప్రభుత్వ హాస్టళ్లలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా గత వారం బీసీ స్కూల్ హాస్టల్‌లో, ఈ వారం బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో వైద్య శిబిరం నిర్వహించామని, రానున్న రోజుల్లో ఇతర హాస్టళ్లలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.ఈరోజు విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి బలమైన పునాది” అని రాజ్‌కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ మహిళా సంఘం నాయకులు అనిత, మంజులా, నర్సమ్మ, జగదీశ్వరి, మంబాపూర్ మంజులా, గోట్కె విజయలక్ష్మి, బీసీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, బీసీ నాయకులు పర్మేష్, రాము ముదిరాజ్, రామ్‌రెడ్డి, దుబాయ్ వెంకటేష్, కిరణ్, వివేక్ పాల్గొన్నారు. అలాగే న్యూ లోటస్ హాస్పిటల్ ప్రతినిధి మాణిక్యం ఆధ్వర్యంలో డాక్టర్ జుబెర్ అహ్మద్, డాక్టర్ ఫిరోజ్ అహ్మద్, డాక్టర్ నౌరీన్ జహాన్, డాక్టర్ మహీదర్, డాక్టర్ సీమ, డాక్టర్ ముజమ్మిల్తో పాటు ఆసుపత్రి వైద్య బృందం, సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు.