వికారాబాద్ జిల్లా తాండూరు
తాండూర్ పారిశ్రామిక ప్రగతిపై కీలక మంతనాలు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ను కలిసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నిమిత్తం తాండూరు పర్యటనకు విచ్చేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, ప్రముఖ సామాజిక సేవకుడు, RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
BSR కుటుంబ సభ్యులు MP ని ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా ఆతిథ్యం అందించారు, అనంతరం తాండూరు ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విస్తరణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
