బిఆర్ఎస్ నాయకులవి చిల్లర రాజకీయాలు
డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది గోపాల్
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
బిఆర్ఎస్ నాయకులవి చిల్లర రాజకీయాలు – వారిని చూసి తాండూరు ప్రజలు అసహ్యించుకుంటున్నారు
డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది గోపాల్..
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో గత శనివారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో టిఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు సృష్టించిన అనవసర రచ్చ, చిల్లర రాజకీయాలను చూసి తాండూరు ప్రజలు అసహ్యించుకుంటున్నారని డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది గోపాల్ అన్నారు.
ఎలాంటి పక్షపాతం లేకుండా, అధికారుల సమక్షంలో పారదర్శకంగా డ్రా విధానంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టగా, దానిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులపై సమగ్ర విచారణ అనంతరం సిద్ధం చేసిన జాబితా నుంచి బహిరంగంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడిందన్నారు.
రహస్యంగా కాకుండా అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహించడం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. పరిపాలనా దక్షతకు, పారదర్శకతకు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిని కూడా సహించలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మీడియా దృష్టిలో పడేందుకు అనవసర హంగామా చేశారని అన్నారు.
గత ఐదేళ్ల పాలనలో ప్రజలు బీఆర్ఎస్ నాయకుల చిల్లర రాజకీయాలను చూసి తగిన గుణపాఠం చెప్పినా, ఇప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. తాండూరు అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు సృష్టించడం బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అలవాటైందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమే అయినప్పటికీ, అనంతరం ప్రజా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. తాండూరు అభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను వెంటనే మానుకొని, స్థానిక ఎమ్మెల్యేకు సహకరించాలని కోరారు. లేదంటే ప్రజల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
