మొహరం సందర్భంగా  36వ వార్డు  కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కల్వరాజ వంశీ.

🔴 మొహరం సందర్భంగా  36వ వార్డు  కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కల్వరాజ వంశీ.

నిజ స్వరూపం తాండూరు ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా.. తాండూరు పట్టణంలో మొహరం సందర్భంగా తాండూర్ లోని 36వ వార్డు ప్రజల ఆహ్వాన మేరకు హాజరైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కల్వరాజ వంశీ.

మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 36వ వార్డులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వరాజ వంశీ హాజరయ్యారు.

36 వ వార్డు సభ్యులు కల్వరాజ వంశీని శాలువా పూలములతో సత్కరించి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సౌభ్రాతృత్వం మరియు మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

అనంతరం నాయకులు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.