🔴 మ్మెల్యే మనోహర్ రెడ్డి ధరసింగ్ గారికి కృతజ్ఞతలు న్యాయవాది గోపాల్.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల దార్శనికత ఉన్న నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
తనను జిల్లా కాంగ్రెస్ కమిటీలో అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మనోహర్ రెడ్డి ని మరియు డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సీనియర్ న్యాయవాది గోపాల్.
తనపై నమ్మకం ఉంచి జిల్లా కాంగ్రెస్ కమిటీలో స్పోక్స్ పర్సన్ గా చోటు కల్పించినందుకు పార్టీ అభివృద్ధి కోసం ప్రచారంలో తన వంతు పాత్ర నిర్వహిస్తానని న్యాయవాది గోపాల్ తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న సామాన్యునికి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధాంతాలు చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
గత ఐదు సంవత్సరాలుగా కుంటుబడిన తాండూరు అభివృద్ధి మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత గాడిన పడ్డదని తెలిపారు.
ఎలాంటి అంగులు ఆర్భాటాలు మీసాలు తిప్పుడు తొడకొట్టుడు వంటివి లేకుండా అభివృద్ధి నినాదంగా మనోహర్ రెడ్డి. ముందుకు సాగుతున్నారు. తాండూరు ప్రాంతంకి నిధులు రాబట్టడంలో ఇటు శాసనసభలు అటు విరివిగా మంత్రులను కలుస్తూ బలమైన లాబీయింగ్ చేస్తూ ఈ మధ్యకాలంలోనే సుమారుగా 1000 కోట్ల రూపాయలు తాండూరు అభివృద్ధిక తీసుకువచ్చిన ఘనత మనోహర్ రెడ్డి కి దక్కుతుంది అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రోడ్లు మరియు మున్సిపల్ రోడ్లు తాండూరు నుంచి వికారాబాద్ రోడ్డు గత పాలకులు విస్మరించినప్పటికీ గెలిచిన రెండేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించిన ఘనత మనోహర్ రెడ్డి కి దక్కుతుంది అన్నారు.
తాండూరు ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని స్థిరమైన ఓటు బ్యాంకు కలిగి ఉండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచే ప్రజలు నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు.
అలాంటి పార్టీకి తనను జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్యే కి ధారాసిన్ కి అదేవిధంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
