పేరేమో రోడ్డు పనులు…! రోడ్డు పనుల మట్టిని బయట అమ్ముతున్నారా.?

పేరేమో రోడ్డు పనులు…!

రోడ్డు పనుల మట్టిని బయట అమ్ముతున్నారా?

సోషల్ మీడియాలో వైరల్ ఆడియో కలకలం

తాండూర్, వికారాబాద్ జిల్లా:

తాండూరు ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల పేరుతో అక్రమ మట్టి తరలింపు జరుగుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రోడ్డు పనుల కోసం తవ్విన మట్టిని నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారానికి సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మట్టి తవ్వకాలు, డంపర్ల ద్వారా తరలింపు, విక్రయాలపై సంభాషణ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

స్థానికులు మాత్రం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.