🔴 రేపు తాండూరుకు మంత్రుల రాక..
నిజస్వరం తాండూర్ ప్రతినిధి::
ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూర్ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.
రేపు అనగా (18-07-2026) శనివారం నాడు ఉదయం 10:00 గంటలకు అంతారం గ్రామ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా రూ.290 కోట్ల విలువైన హ్యామ్ (HAM) రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం ఉదయం 10:15 గంటలకు కందనెల్లి పరిధిలోని GPR గార్డెన్స్‌లో బైపాస్ భూనిర్వాసితులకు రూ.25 కోట్ల పరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం మరియు “ప్రగతి సభ” నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ఈ తాండూర్ “ప్రగతి సభకు” తరలివచ్చి విజయవంతం చేయగలరు అని కోరారు.
