ఘనంగా ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు
 వార్డు ప్రజల మధ్య కేక్ కట్ చేసిన సొసైటీ డైరెక్టర్
హాజరైన మదీనా గల్లి నాయకులు, టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్

తాండూరు మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పరి స్వరూప భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు గురువారం వార్డు ప్రజల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. మదీనా గల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లేశం చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మల్లేశం మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, కోర్వర్ నాగేష్‌లతో పాటు మదీనా గల్లీ వాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.