ఓకే ఇంట్లో 230 దొంగ ఓట్లు నమోదు

 ఓకే ఇంట్లో 230 దొంగ ఓట్లు నమోదు

బోగస్ ఓట్లపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు 

మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రాజు గౌడ్ 

 పురపాలక సంఘం ఎన్నికల భాగంగా 29వ వార్డ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా పాలన దరఖాస్తుల పేరిట అక్రమంగా ఒకే ఇంటి నెంబర్ నుంచి 230 బోగస్ ఓట్లను నమోదు చేశారని 29వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, వికారాబాద్ మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రాజు గౌడ్ ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు బోగస్ ఓట్లు నమోదులో సంబంధిత అధికారులు సహకరించారని, గుర్తింపు లేని ఓటర్ల జాబితా ప్రాతిపదికంగా వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి, మున్సిపల్ కమిషనర్, తాండూర్ డీఎస్పీ కి సోమవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో బోగస్ ఓట్లను నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బోగస్ ఓట్లను గుర్తించిన ఓటరు పోలింగ్ కేంద్రానికి వస్తే బి ఎల్ ఓ, వాట్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల సంఘం గుర్తించిన 18 రకాల గుర్తింపు కార్డులను మాత్రమే అనుమతి ఇవ్వాలని, ఏదైనా ఇతర గుర్తింపు కార్డులు ప్రదర్శిస్తే సంబంధిత అధికారులు తిరస్కరించి , వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.