ఎమ్మెల్యే నిధులతో..13వ వార్డ్ లో సిసి రోడ్.

🔴 అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి 

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు మిత్రనగర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే నిధులతో.  సిసి రోడ్లు రూ. 10 లక్షలు , మురికి కాల్వలు రూ. 5లక్షలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వార్డ్ 13 లో గతంలో కోటి రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.

అదేవిదంగా వివిధ అభివృద్ధి పనుల కోసం పదమూడవ వార్డులో కోటి యాభై లక్షల నిధులు వెచ్చించనున్నట్లు చెప్పారు. గ్రీన్ సిటీ కాలనీ, మార్కెండే య కాలనీ, మిత్ర నగర్ తదితర కాలనీ లో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు.

వార్డ్ ల అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, కోకట్ గ్రామ సర్పంచ్ పబ్బన్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, డిఈ కృష్ణ, ఏఈ గౌతమ్, ఏపీ ఓ జనార్దన్, టి ఎ నీలకంఠం, ఎఫ్ ఎ రమేష్, ఎంక పల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, చంద్రా రెడ్డి, దివాకర్ రెడ్డి, కాలనీ వాసులు విజయమ్మ, లత, గోవిందా రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.