తాండూర్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం.

12వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్న మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు

తాండూరు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి లతో కలిసి బుధవారం పట్టణంలోని సాయిపూర్ 12 వ వార్డు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 36 వార్డులకు గాను 36 వార్డులు గెలవబోతున్నామని ఆశాభవం వ్యక్తం చేశారు. తాండూరు యువ ఓటర్లు ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తమ విలువైన ఓటు ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓటు ఆయుధం లాంటిదని, ఓటు ద్వారానే తీర్పు వెలువడుతుందని, తాండూరు అభివృద్ధి కోసం మంచి నాయకులను ఎన్నుకునేందుకు యువ ఓటర్లు ముందుకు వచ్చి ఓటు వేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. ఓటు వేసిన వారిలో మనోహర్ రెడ్డి తనయులు శివారెడ్డి, అవినాష్ రెడ్డి, భార్య బుయ్యని అరుణ రెడ్డి, కోడళ్ళు, పట్లోళ్ల బాల్ రెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.