🔴 గ్రామీణ రవాణా అభివృద్ధికి చారిత్రక అడుగు – రూ.289 కోట్లతో అభివృద్ధి బాటలో తాండూరు నియోజకవర్గం
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాసుల వరం.
గ్రామీణ రవాణా అభివృద్ధికి చారిత్రక అడుగు – రూ.289 కోట్లతో అభివృద్ధి బాటలో తాండూరు నియోజకవర్గం – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషికి ఫలితం
తెలంగాణ రవాణా రంగ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నల్లగొండలో శంకుస్థాపన చేయనున్న 13,541 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రూ.19,300 కోట్ల భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తాండూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి బాట పట్టింది.
HAM (Hybrid Annuity Model) విధానంలో వికారాబాద్ జిల్లాకు రూ.520 కోట్ల నిధులు కేటాయించగా, అందులో సింహభాగంగా రూ.289 కోట్ల భారీ నిధులు ఒక్క తాండూరు నియోజకవర్గానికే లభించడం గర్వకారణం.
రూ.289 కోట్ల నిధులతో *తాండూరు–పెద్దేముల్,* *పెద్దేముల్–కోట్పల్లి,* *లక్ష్మీనారాయణపూర్–దేవనూర్, కమాల్పూర్–రాస్తం* వంటి కీలక రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరగనున్నాయి.
అలాగే వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారంగా యాలాల మండలం కోకట్ వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం కూడా చేపట్టనున్నారు.
ఈ అభివృద్ధి పనులతో తాండూరు నియోజకవర్గ రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుందని, ప్రజల కష్టాలు శాశ్వతంగా తగ్గుతాయని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాండూరు అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
