మఠం వైష్ణవిని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు.

🔴 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన.

🟣 మఠం వైష్ణవిని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన మఠం వైష్ణవిని బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు.  మంగళవారం తాండూరు పట్టణంలోని  సిటీకేబుల్ ఇంచార్జ్ మఠం నిరంజన్ నివాసంలో  తాండూరు బిజెపి నాయకులు  మఠం  వైష్ణవిని శాలువా  పూలమాలతో సత్కరించే స్వీట్లు తినిపించారు.

ఈ సందర్భంగా  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ  మఠం వైష్ణవి  భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను సాధించాలని కోరారు.  తల్లిదండ్రులకు తాండూరు కు,  పుట్టిన గ్రామానికి  మంచి పేరు తెచ్చిన మఠం వైష్ణవి  అందరికీ ఆదర్శం అని అన్నారు.

ఇలాంటి  సరస్వతీ పుత్రిక తాండూర్ లో ఉండడం అందరికీ గర్వకారణం అని అన్నారు.  మఠం వైష్ణవి  భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు రమేష్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో రెండవ  ర్యాంక్  సాధించిన మఠం వైష్ణవి మాట్లాడుతూ తల్లిదండ్రులు,  శ్రీ చైతన్య మదీనాగూడ  కళాశాల అధ్యాపకులు, తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల  ఉపాధ్యాయులు,  ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్ తదితరుల శిక్షణ వల్ల మరియు ప్రణాళిక బద్ధంగా చదివినందువల్లే అత్యధిక మార్కులు సాధించానని తెలిపారు. తనను  సన్మానించిన ప్రతి ఒక్కరికి మఠం వైష్ణవి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోతాండూర్ పట్టణ బిజెపి అధ్యక్షులు,  కౌన్సిలర్ నాగారం మల్లేశం,  జిల్లా నాయకులు కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, శ్రీకాంత్,పటేల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.