రాజ్ పుత్ బిసి కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

🔴 రాజ్ పుత్ బిసి కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్  ఇందిరా నగర్ వార్డ్ నెంబర్ 5 లో బీసీ కమ్యూనిటీ హాల్ నిమిత్తం బొందిలి రాజ్ పుత్ సమాజానికి కేటాయించిన స్థలంలో గల శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

గతంలో మాజీ రవాణా శాఖ మంత్రులు వర్యులు ప్రస్తుత ప్రభుత్వ చీప్ విఫ్ మహేందర్ రెడ్డి బొందిలి సమాజ రాజ్ పుత్ సమాజం కమ్యూనిటీ హాల్ నిర్మాణ నిమిత్తం రూ, ఐదు లక్షలు నిధులు కేటాయించారు. ఈ మేరకు మంత్రిగా ఉన్న సమయంలో శిలాఫలకాన్ని ప్రారంభించారు.

అయితే శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ మేరకు సమాజ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మా యొక్క సమాజ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో నివేదించారు.

ఈ కార్యక్రమంలో రాజ్ పుత్ సమాజం గౌరవాధ్యక్షులు ఠాకూర్ సుభాష్ సింగ్, అధ్యక్షులు ఠాకూర్ దిలీప్ సింగ్, ఉపాధ్యక్షులు ఠాకూర్ ఉమేష్ సింగ్, ట్రెజరర్ ఠాకూర్ ప్రతాప్ సింగ్, మాజీ అధ్యక్షులు ఠాకూర్ రమేష్ సింగ్, ఠాకూర్ ప్రభాకర్ సింగ్, ఠాకూర్ నర్సింగ్ సింగ్, ఠాకూర్ రాజు సింగ్, రాజపుత్ యూవదళ్ అధ్యక్షులు ఠాగూర్ దీపక్ సింగ్, ఠాకూర్ శివాజీ సింగ్ లు పాల్గొన్నారు.