వికారాబాద్ జిల్లా…
జెట్టెపాగ నరేష్ అకాల మృతికి BSR ప్రగాఢ సంతాపం
తాండూరు: ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన జెట్టెపాగ నరేష్ కుటుంబాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) పరామర్శించారు. నరేష్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన BSR.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ విషాద సమయంలో నరేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని BSR భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ డీవీటీ ఎల్లప్ప, 19వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి, స్థానిక యువకులు అంజిలయ్య, శివ, సాయి ప్రసాద్, వినోద్ కుమార్, కృష్ణ, యాదగిరి, వేణు తదితరులు పాల్గొన్నారు.
