ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తన కొడుకు కార్తీక్ రెడ్డితో కలిసి నేడు తాండూరు పట్టణంలోని జూనియర్ పాఠశాలలోనీ 28 వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూర్, పరిగి, కొడంగల్, వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ లోని మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. తాండూర్లో కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి వార్డులలో ప్రచారం నిర్వహించడం జరిగిందని, తప్పకుండా తాండూర్ లో మున్సిపల్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనున్నట్లు తెలిపారు. చైర్మన్ అభ్యర్థి విషయాల్లో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం అని మహేందర్ రెడ్డి అన్నారు
