వికారాబాద్ జిల్లాలోనీ తాండూర్, కొడంగల్, వికారాబాద్, పరిగి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్ పేర్కొన్నారు. తాండూరులో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలన సందర్భంగా జూనియర్ కళాశాల వద్ద డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య తో కలిసి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని తాండూర్, వికారాబాద్, కొడంగల్, పరిగి మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తాండూరులోనీ 36 వార్డులలో మొత్తం 77, 110 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 34 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమసాత్మకమైన 13 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీసు భద్రతను కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఫిర్యాదులు అంతలేదని అన్నారు. ఓటు బలమైన ఆయుధం కావున ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వెళ్లి ఓటేయాలని సూచించారు.
జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు
