పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

🔴 పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి

వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ రోజు సిద్దన్నామడుగు తాండ మరియు తట్టెపల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బండమీది పల్లి గ్రామానికి చెందిన చింతల్ సంజీవ తన మోటార్ సైకిల్‌పై తన కుమార్తె భవాని (10 సంవత్సరాలు, 5వ తరగతి) మరియు తన అన్న కుమారుడు ఆకాష్ (7వ తరగతి)లను గొట్లపల్లి మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు తీసుకెళ్తుండగా, ఎదురుగా ఓమ్లా నాయక్ తాండకు చెందిన బొలెరో వాహనం అధిక వేగంతో అజాగ్రత్తగా నడిపిస్తూ వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చింతల్ సంజీవకు ఎడమ కాలుకు ఫ్రాక్చర్ కాగా, అతని కుమార్తె భవానికి కుడి కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఆకాష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి కారణమైన బొలెరో వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పెద్దేముల్ ఎస్సై శ్రీ ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.